Couple Friendly OTT: ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly OTT) మూవీ.
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 12:01 PM IST
Couple friendly movie now streaming on amazon prime
Couple Friendly OTT: టాలీవుడ్ యంగ్ హీరో శోభన్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా థియేట్రీకల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ(Couple Friendly OTT) హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. సడన్ గా ఈ సినిమా ఓటీటీకి రావడంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటీటీలో కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ డబుల్ ధమాకా.. ఒకే రోజు సుకుమార్, బుచ్చిబాబుల సర్ప్రైజ్ ట్రీట్!
