Jailer Fever : జైలర్ సినిమా చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చిన జపనీస్ జంట.. రజనీ ఫీవర్ మామూలుగా లేదుగా

సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా జైలర్ రిలీజ్‌ను వారు పండగ చేసుకుంటున్నారు. ఓ జపనీస్ జంట జైలర్ సినిమా చూడటానికి ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి ప్రయాణం చేసి వచ్చింది.

Jailer Fever

Jailer Fever : సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలైన జైలర్ సినిమాలో రజనీ స్క్రీన్‌పై తిరిగి తన మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఆయన నడక, నడత, స్టైల్‌కి ఫిదా అయిపోయే ఫ్యాన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. జైలర్ సినిమా చూడటానికి జపాన్ నుంచి ఓ జంట చెన్నైకి వచ్చిందంటేనే ఆయన పాపులారిటీ అర్ధం అవుతుంది.

Nagababu : రజినీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ అట్రాక్షన్..

రజనీ కాంత్ జైలర్ ఫీవర్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఉత్సాహం మామూలుగా లేదు. ఓ జపనీస్ జంట అయితే జైలర్ సినిమా చూడటానికి ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి ప్రయాణం చేసి వచ్చింది. జపాన్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడినని చెబుతున్న హిడెతోషి అతని భార్య జైలర్ సినిమా కోసం చెన్నై వచ్చారు. 20 సంవత్సరాలుగా హిడెతోషి రజనీకాంత్‌కి వీరాభిమానిగా ఉన్నాడట. 1995 లో విడుదలైన ముత్తు, భాషా సినిమాలు చూసాక తాను రజనీకి అభిమానిగా మారినట్లు హిడెతోషి చెప్పాడు.

Jailer Twitter Review : జైలర్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ లోకి దిగితే..

హిడెతోషి రజనీకాంత్ సినిమా రిలీజ్ అప్పుడు చెన్నైకి రావడం ఇది కొత్తేం కాదట. గతంలో రిలీజైన దర్బార్, కబాలి సినిమాల కోసం కూడా చెన్నై వచ్చాడట. ప్రస్తుతం ఈ జంట మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రజనీకి అసలైన అభిమాని ఇతను అని.. ప్రపంచ వ్యాప్తంగా తలైవాకి అభిమానులు ఉన్నారడానికి ఇది ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.