Bollywood actress : చీటింగ్ కేసులో బాలీవుడ్ నటికి కోర్టు మధ్యంతర బెయిల్

చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు సీల్దా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల వ్యక్తిగత పూచీకత్తుపై డిసెంబర్ 26వతేదీ వరకు జరీన్ ఖాన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.....

Bollywood actress : చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు సీల్దా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల వ్యక్తిగత పూచీకత్తుపై డిసెంబర్ 26వతేదీ వరకు జరీన్ ఖాన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోల్‌కతా నగరంలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి జరీన్ ఖాన్ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని సిటీ కోర్టు సోమవారం ఆదేశించింది.

ALSO READ : IPL 2024 auction : ఐపీఎల్ 2024 వేలం కోసం 333 మంది ఆటగాళ్లు

ముంబయి నుంచి వచ్చిన జరీన్‌ఖాన్‌ను కూడా ప్రతి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.2018వ సంవత్సరంలో కోల్‌కతా నగరంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు జరీన్ ఖాన్ రూ.12 లక్షలను అడ్వాన్సుగా తీసుకుంది.

ALSO READ : Onion Price : తగ్గిన ఉల్లి ధరలు…మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10

పూజ కార్యక్రమానికి నటి జరీన్ ఖాన్ రాకపోవడంతో ఆమెపై, ఆమె మేనేజరుపై నార్కెల్‌దంగ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్‌లో కోర్టు జరీన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు