×
Ad

SriDevi: కోర్టు బ్యూటీకి బంపర్ ఆఫర్.. తమిళంలో క్రేజీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?

కోర్టు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదేవి(SriDevi). తన సహజమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంటోంది శ్రీదేవి.

Court movie heroine Sridevi signs another Tamil film

SriDevi: కోర్టు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదేవి. తన సహజమైన నటనతో సినిమా విజయంలో కీలక (SriDevi)పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంటోంది శ్రీదేవి. ఇప్పటికే తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల తమిళ ఇండస్ట్రీలో జో అనే సూపర్ హిట్ సినిమాను సంస్థ విజన్ సినిమా హౌజ్ మరో క్రేజీ సినిమాకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘ఏగన్’ హీరోగా నటిస్తున్నాడు.

Aditi Rao Hydari: అది నేను కాదు.. అవన్నీ నమ్మకండి.. వెంటనే మాకు తెలియజేయండి..

మిన్నల్ మురళి సినిమా ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆహా కళ్యాణం’ అనే త‌మిళ వెబ్ సిరీస్ ఫేమ్ డైరెక్ట్ యువరాజ్ చిన్నసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం శ్రీదేవిని తీసుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. బేబీ, కోర్ట్ సినిమాలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు.

ఈ ప్రాజెక్టు గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. కథ చాలా బాగా సెట్ అయ్యింది. తమిళ, తెలుగులో ఏ కాలంలో షూట్ చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.