Aditi Rao Hydari: అది నేను కాదు.. అవన్నీ నమ్మకండి.. వెంటనే మాకు తెలియజేయండి..

నేను మీకు ఒక ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మధ్య ఆ వార్త నా (Aditi Rao Hydari)దృష్టికి వచ్చింది. ఆ విషయంపై మీ అందర్నీ అప్రమత్తం చేయాలనుకుంటున్నాను.

Aditi Rao Hydari: అది నేను కాదు.. అవన్నీ నమ్మకండి.. వెంటనే మాకు తెలియజేయండి..

Heroine Aditi Rao Hydari responds to fake messages in her name

Updated On : November 17, 2025 / 6:51 AM IST

Aditi Rao Hydari: ఈ మధ్య కాలంలో ఫేక్ రాయుళ్ల గోల ఎక్కువ అయ్యింది. ప్రముఖ వ్యక్తుల ఫోటోలను, సోషల్ మీడియా (Aditi Rao Hydari)ఐడీలను వాడుతూ ఫ్రాడ్ చేస్తున్నారు. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. తీరా అక్కడికి వెళ్లి చేస్తూ చిన్న అమ్మాయి ఇలా చేస్తుంది అని తెలిసి షాక్ అయ్యారు. ఇక తాజాగా మరో బ్యూటీకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. ఆ నటి మరెవరో కాదు అదితిరావు హైదరి. కొంతకాలం నుంచి అదితిరావు హైదరి ఫోటో ఉన్న వాట్సాప్ తో ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్స్ కి మెసేజెస్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడట. ఈ విషయం అదితిరావు హైదరి వద్దకు వెళ్లడంతో ఆమె స్పందించింది.

Gouri Kishan: గ్లామర్ తో రచ్చ చేస్తున్న గౌరీ కిషన్.. ఫోటోలు

“నేను మీకు ఒక ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మధ్య ఆ వార్త నా దృష్టికి వచ్చింది. ఆ విషయంపై మీ అందర్నీ అప్రమత్తం చేయాలనుకుంటున్నాను. నా పేరుతో ఓ వ్యక్తి ఫొటోషూట్స్‌ లో ఫొటోగ్రాఫర్లకు మెసేజెస్ పంపిస్తున్నాడు. అది నేను కాదు. ఫొటోషూట్స్‌ కోసం నేను ఎవ్వరికీ ఫోన్ నంబర్స్ ఇవ్వలేదు. దానికి నా స్పెషల్ టీమ్‌ ఉంది. దాని ద్వారానే సంప్రదిస్తాను. ఇకముందు ఎవరైనా నా పేరుతో కాంటాక్ట్ అయితే వెంటనే మాకు తెలియజేయండి”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.