Dasari Narayana Rao: దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు
దర్శక దిగ్గజం, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వ్యక్తి, దివంగత దాసరి నారాయణ రావు ఇంటికి కోర్టు నోటీసులు ఇచ్చింది.

Dasari
Dasari Narayana Rao: దర్శక దిగ్గజం, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వ్యక్తి, దివంగత దాసరి నారాయణ రావు ఇంటికి కోర్టు నోటీసులు ఇచ్చింది.
దాసరి నారాయణరావు తనయులు అరుణ్, ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ సెక్షన్ 151 CPC క్రింద సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అరుణ్, ప్రభులకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో భాగంగా కోర్టు నోటీసులు అందించింది.
ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమశేఖర్ రావు అనే వ్యాపారి వద్ద 2కోట్ల 11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు తిరిగి చెల్లించట్లేదంటూ ఈమేరకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చారు.
ఒప్పందం ప్రకారం తీసుకున్న గడువు మించిపోవడంతో సదరు వ్యాపారి సివిల్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, దాసరి ఇంటికి నోటీసులు పంపింది. నవంబర్ 15వ తేదీలోగా సోమశేఖర్ రావు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది కోర్టు.