Sangharshana : ‘సంఘర్షణ’ మూవీ రివ్యూ..

ఇటీవల సీరియల్ కిల్లింగ్ అంటూ క్రైం థ్రిల్లర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందింది.

Crime Thrilling Movie Sangharshana Review

Sangharshana Movie Review : చైతన్య, రసీదా భాను జంటగా తెరకెక్కిన సినిమా సంఘర్షణ. మహీంద్ర పిక్చర్స్ బ్యానర్ పై వల్లూరి శ్రీనివాస రావు నిర్మాణంలో చిన్న వెంకటేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శివ రామచంద్రపు, ఎక్స్ ప్రెస్ హరి, స్వాతిశ్రీ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సంఘర్షణ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అనుకోకుండా వీరి జీవితాల్లో ఒక సంఘటన జరుగుతుంది. దాంతో వాళ్ళ జీవితంలో రిస్క్ ఏర్పడుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ ని పోలీస్ ఆఫీసర్ దీపక్ (శివ) ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటాడు. వరుసగా మర్డర్స్ జరుగుతున్నా ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో దీపక్ కి పైనుంచి ప్రెజర్ పెరుగుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? దీపక్ కిల్లర్ ని పెట్టుకున్నాడా? ఆ మర్డర్స్ కి చైతన్య, సంయుక్తలకు సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Simbaa : ‘సింబా’ మూవీ రివ్యూ.. అనసూయ సినిమా ఎలా ఉందంటే?

సినిమా విశ్లేషణ.. ఇటీవల సీరియల్ కిల్లింగ్ అంటూ క్రైం థ్రిల్లర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందింది. సమాజంలో జరుగుతున్న ఓ క్రైం సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. స్క్రీన్ ప్లేని థ్రిల్లింగ్ గానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హత్యలు జరుగుతుండటం పోలీసులు దాన్ని పట్టుకోలేకపోవడంతో ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేయడంతో పాటు కథ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. మెయిన్ లీడ్స్ లో చైతన్య, రసీదా బాగానే నటించారు. పోలీసాఫీసర్ గా శివ రామచంద్రపు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎక్స్ ప్రెస్ హరి అక్కడక్కడా కామెడీని పండించాడు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. థ్రిల్లింగ్ అంశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. కొత్త దర్శకుడు చిన్న వెంకటేష్ మొదటి సినిమాని బాగానే హ్యాండిల్ చేసి పర్వాలేదనిపించారు. నిర్మాణ పరంగా నిర్మాత వల్లూరి శ్రీనివాస్ రావు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా సంఘర్షణ ఒక క్రైం థ్రిల్లర్ సినిమా. థ్రిల్లింగ్ సినిమాలు చూసేవాళ్లకు నచ్చుతుంది.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు