సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న‘దబాంగ్ 3’.. నుండి చుల్‌బుల్ పాండే ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్..
సల్మాన్ ఖాన్ చుల్‌బుల్ పాండేగా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. దబాంగ్, దబాంగ్ 2 సినిమాల తర్వాత.. యాక్టర్, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటిస్తున్న మూవీ ‘దబాంగ్ 3’.. సల్మాన్ ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రోన్ బ్రోడ్‌కాస్ట్ & మీడియా లిమిటెడ్ బ్యానర్స్‌పై.. సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు.
అర్బాజ్ ఖాన్, మహీ గిల్, సంతోష్ శుక్లా కీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా చుల్‌బుల్ పాండే ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. సల్లూ భాయ్ చుల్‌బుల్ పాండేగా అదరగొట్టేశాడు.. తన స్టైల్ మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు.
‘సల్మాన్ ఖాన్ దబాంగ్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నాడు అంటే సినిమా నాది, పోస్టరూ నాదే.. సినిమా కూడా నాదే అయినప్పుడు నేనే ప్రమోట్ చెయ్యాలి కదా’.. అంటూ సల్మాన్ మూవీని డిఫరెంట్‌గా ప్రమోట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. డిసెంబర్ 20న దబాంగ్ 3 విడుదల కానుంది.