Dadasaheb Phalke International Film Festival Awards 2023 full list
#DPIFF2023 : మన దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత సినిమా అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఒకటి. ప్రతి సంవత్సరం ఈ అవార్డుల వేడుక ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా 2022 లో రిలీజయిన సినిమాలకు గాను అవార్డులు అందించారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పేరిట ఈ అవార్డుల కార్యక్రమం సోమవారం సాయంత్రం ముంబైలో జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 ఫుల్ లిస్ట్..
ఉత్తమ చిత్రం : ది కాశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్)
ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)
బెస్ట్ యాక్టర్ నెగిటివ్ రోల్ : దుల్కర్ సల్మాన్ (చుప్)
బెస్ట్ యాక్ట్రెస్ నెగిటివ్ రోల్ – మౌని రాయ్ (బ్రహ్మాస్త్ర)
సినీ పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2023 : రేఖ
ఉత్తమ వెబ్ సిరీస్ : రుద్ర
క్రిటిక్స్ ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేడియా)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: RRR
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అఫ్ ది ఇయర్ : అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఇన్ టెలివిజన్ – హర్షద్ చోప్రా
బెస్ట్ టీవీ యాక్టర్ : జైన్ ఇమామ్
బెస్ట్ టీవీ యాక్ట్రెస్ – తేజస్వి ప్రకాష్ (నాగిని 6)
బెస్ట్ మేల్ సింగర్ : సచేత్ టాండన్ (మయ్యా మైను – జెర్సీ)
బెస్ట్య్ ఫీమేల్ సింగర్ : నీతి మోహన్ ( మేరీ జాన్ – గంగూబాయి కతియావాడి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: PS వినోద్ (విక్రమ్ వేద)
సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2023 : హరిహరన్