Rana Naidu : రానా నాయడు మళ్ళీ వస్తున్నాడు.. ఈసారి ఇంకెత బోల్డ్ కంటెంట్‌తో వస్తాడో?

వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఓవర్ డొసేజ్ బోల్డ్‌నెస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ సెకండ్ సీజన్ రెడీ అవుతుంది.

Daggubati Venkatesh Rana Daggubati Rana Naidu series season 2

Rana Naidu : దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్ సిరీస్ రే డొనోవన్ (Ray Donovan) కి ఇది అఫీషియల్ అడాప్షన్ గా తెరకెక్కింది. ఇండియాలోనే మొదటిసారి బోల్డ్ కంటెంట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సిరీస్ నార్త్ వాళ్ళకి ఆకట్టుకున్నా, సౌత్ వాళ్లకి మాత్రం ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న వెంకటేష్ ఇటువంటి సిరీస్ లో నటించడం అందర్నీ షాక్ గురి చేసింది.

Saindhav : వెంకీ మామ అప్డేట్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నాడు..

తెలుగు ఆడియన్స్ ఈ సిరీస్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిరీస్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఈ సిరీస్ ని బూతు సినిమాగా అభివర్ణించారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ తెలుగు వెర్షన్ ని తొలిగించింది. ఇక తెలుగు ఆడియన్స్ నుంచి ఇంతటి వ్యతిరేకత రావడంతో వెంకటేష్ మళ్ళీ అటువంటి సిరీస్ లో నటించాడు అని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సిరీస్ సెకండ్ సీజన్ రాబోతుంది అంటూ ప్రకటించారు. నాయుడుస్ మళ్ళీ వస్తున్నారు అంటూ నెట్‌ఫ్లిక్స్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు.

Rana Naidu : నెట్‌ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు డిలీట్.. కారణం ఏంటి?

ఇక ఈ పోస్ట్ చూసిన తెలుగు ఆడియన్స్ స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్ ని తెలుగులో రిలీజ్ చేయాలి అనుకుంటే బోల్డ్ కంటెంట్‌ని తగ్గించి సిరీస్ ని తెరకెక్కించండి అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేస్తే, మరో నెటిజెన్.. ఫస్ట్ సీజనే చూడలేకపోయాం. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఎందుకు అంటూ కామెంట్ చేశాడు. మరి ఈ సెకండ్ సీజన్ బోల్డ్ కంటెంట్‌ డొసేజ్ ని తగ్గిస్తారా? లేదా? అనేది చూడాలి.