RRR మూవీలో.. తారక్ కి జోడిగా హాలీవుడ్‌ భామ

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 12:46 PM IST
RRR మూవీలో.. తారక్ కి జోడిగా హాలీవుడ్‌ భామ

Updated On : March 15, 2019 / 12:46 PM IST

భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ఈ చిత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ నటిస్తుందని ప్రకటించిన జక్కన… ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ పిల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుంది అని తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే నెటిజన్లు ఈ భామ గురించి తెగ వెతికేస్తున్నారు. 
Read Also: ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవ‌త్స‌రాలు..అనుష్క

అలీయా భట్ గురించి అందరికీ తెలుసు కానీ… ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్ అని అందరూ ఆసక్తిగా వెతుకుతున్నారు. డైసీ ఎడ్గర్ జోన్స్… హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. ఎడ్గర్ జోన్స్ అమెరికన్‌, ఐరిష్‌ యాసలో మాట్లాడగలుగుతుంది. గిటార్‌ వాయించడం, పాటలు పాడటం అంటే ఎడ్గర్‌కు ఎంతో ఇష్టం.   హాలీవుడ్‌లో 22 ఏళ్ల క్రితమే ‘కోల్డ్ ఫీట్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది డైసీ. ఆ తర్వాత గత ఏడాది విడుదలైన ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలోనూ నటించింది. ఇప్పుడు ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. 

RRR సినిమాలో కథకు అనుగుణంగా బ్రిటిన్ పిల్లగా డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించబోతోంది. ‘RRR’ వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. 2020 జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికీ, నందమూరి కుటుంబానికి పెద్దగా పడదు అనే నెగిటివ్ టాక్ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా హీరోలు లోపల ఎంత సఖ్యంగా ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అలాంటి రెండు స్టార్‌లను కలుపుతూ జక్కన్న రూపొందిస్తున్న ‘RRR’ సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ ఛేంజర్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు సినీ ప్రేక్షకులు.
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల