Dancers Union
Dancers Union : సినీ పరిశ్రమలో ప్రతి క్రాఫ్ట్ కి యూనియన్ ఉంది. ఆ యూనియన్ లో ఎంటర్ అవ్వాలంటే లక్షల్లో ఫీజు కూడా ఉంది. ఆ యూనియన్ లో మెంబర్ కాకుండా ఎవరైనా వర్క్ చేసినట్టు తెలిస్తే యూనియన్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చెప్తారు. ఇది కరెక్ట్ కాదు అని, యూనియన్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల ట్యాలెంట్ ఉన్నవాళ్లు సినిమాల్లోకి రాలేకపోతున్నారని ఇటీవల నిర్మాతలు టాలీవుడ్ సమ్మె జరిగినప్పుడు ఆరోపణలు చేసారు.(Dancers Union)
తాజాగా ఢీ షో ఫేమ్ డ్యాన్సర్ రాజు కూడా యూనియన్ కార్డు కోసం 5 లక్షలు ఇచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న రాజు తాజాగా ఓ ఛానల్ కిఇంటర్వ్యూ ఇచ్చాడు.
Also Read : Anupama Parameswaran : పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అనుపమ.. తీరా చూస్తే 20 ఏళ్ళ అమ్మాయి.. హీరోయిన్ పోస్ట్ వైరల్..
ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసారా అని అడగ్గా రాజు మాట్లాడుతూ.. నా ఇన్ స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి నా పేరుతో డబ్బులు అడిగారు కొంతమంది. ఫ్యాన్ అని చెప్పి వచ్చి నా దగ్గర తమ్ముడు అని జాయిన్ అయి నా పర్సనల్స్ అన్ని బయటపెట్టారు ఒకరు. ఇలా చాలా రకాలుగా కొంతమంది మోసం చేసారు.
ఒకసారి అయితే డ్యాన్సర్ యూనియన్ లో కార్డు కోసం 5 లక్షలు ఇచ్చాను. చైతన్య మాస్టర్ కి ఇస్తే ఆయన కార్డు కోసం యూనియన్ లో ఎవరికో ఇచ్చారు. కానీ ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు. నాకు ఇంకా కార్డు రాలేదు. ఇది జరిగి నాలుగు ఏళ్ళు అవుతుంది. నాకు కార్డు లేకపోవడం వల్ల వచ్చిన మూవీ ఆఫర్స్ కూడా పోయాయి. ఇప్పుడు కార్డు కావాలంటే ఆరు లక్షలు. నా దగ్గర అంత డబ్బులేదు అని తెలిపాడు.
Also Read : Suma Kanakala : యాంకర్ సుమకు ఈ రికార్డ్ కూడా ఉందా? అప్పట్లోనే అమెరికాలో..
అందుకే రాజు ఇంత ట్యాలెంట్ ఉన్నా సినిమాల్లో కనిపించకపోవడానికి, సినిమా పాటలకు వర్క్ చేయకపోవడానికి ఇదే కారణం అని తెలుస్తుంది. మరి దీనిపై డ్యాన్సర్స్ యూనియన్ స్పందిస్తుందేమో చూడాలి.