danchave menatha kuthura song removed from Balakrishna Bhagavanth Kesari
Bhagavanth Kesari : అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. రేపు అక్టోబర్ 18న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అవి కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే, సినిమాలో థ్రిల్ ఫీల్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయంటూ బాలయ్య, అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నారు.
కాగా ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ని రీమేక్ చేస్తున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఈ పాట కోసం దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు చేశారంట. అయితే ఆ సాంగ్ ని ఇప్పుడు మూవీ నుంచి డిలీట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఏది నిజం..? ఏది అబద్దం..? తెలియని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. కాగా పరిశ్రమలోని కొందరు చెబుతున్న మాట ఏంటంటే.. ఈ పాటని సినిమా నుంచి తొలిగించలేదంట. ఫస్ట్ వీక్ పూర్తీ అయిన తరువాత యాడ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారంట.
Also read : Allu Arjun : నేషనల్ అవార్డుతో ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్..
ఇక ఈ సాంగ్ రీమేక్ అయితే కాదని చెబుతున్నారు. ఓల్డ్ సాంగ్ నుంచి కేవలం ‘దంచవే మేనత్త కూతురా’ అనే వోకల్స్ ని మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు. మరి సినిమాలో ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలి. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి థమన్ నందమూరి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. ఇప్పుడు భగవంత్ కేసరితో కూడా అభిమానులకు అదే హైని ఇచ్చేలా మ్యూజిక్ ని చేసినట్లు చెబుతున్నారు.