Extra Ordinary Man : శ్రీలీల డేంజర్ పిల్ల అంటున్న నితిన్.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్..

నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. శ్రీలీల డేంజర్ పిల్ల అంటూ నితిన్..

Danger Pilla Song Promo release from Nithiin Extra Ordinary Man

Extra Ordinary Man : నితిన్ (Nithiin), శ్రీలీల (SreeLeela) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. స్టార్ రైటర్ వక్కంతం వంశీ తన రెండో సినిమాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ.. డిసెంబర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే, మరో పక్క ప్రమోషన్స్ పనులు కూడా మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయగా, తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

KotaBommali PS : మలయాళ రీమేక్‌లో శ్రీకాంత్‌.. ఆక‌ట్టుకుంటున్న కోట బొమ్మాళి PS ఫ‌స్ట్ లుక్‌

హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘డేంజర్ పిల్ల’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగల్ ని అర్మాన్ మాలిక్ పాడాడు. స్లో బీట్ డ్యూయెట్ అయిన ఈ సాంగ్ లో నితిన్ అండ్ శ్రీలీల గ్రేస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కోరియోగ్రఫీ చేశాడు. ఫుల్ సాంగ్ ని ఆగష్టు 2న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Urvashi Rautela : వంద‌ప్ర‌శ్న‌లేస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌కే స్పందించింది.. ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంచుకోమంటే..?

కాగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన మొదటి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ రెండో సినిమాతో వంశీ ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా? చూడాలి. ఇక ప్రస్తుతం నితిన్ కూడా ప్లాప్‌ల్లోనే ఉన్నాడు. గత నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. నితిన్ ప్రెజెంట్.. ఈ చిత్రం, అలాగే తనకి సూపర్ హిట్టుని అందించిన వెంకీకుడుముల ద‌ర్శ‌క‌త్వంలో VNRTrio చేస్తున్నాడు. త్వరలో వేణు శ్రీరామ్ తో కూడా సినిమా చేయబోతున్నాడని సమాచారం.