‘దర్బార్’ మోషన్ పోస్టర్ : ఆదిత్య అరుణాచలంగా ‘సూపర్‌స్టార్’

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు..

  • Publish Date - November 7, 2019 / 12:21 PM IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు..

సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘దర్బార్’ మోషన్ పోస్టర్  నాలుగు బాషల్లో విడుదల చేశారు.

తమిళ్ పోస్టర్ ‘విశ్వనాయకుడు’ కమల్ హాసన్, హిందీ మోషన్ పోస్టర్ సల్మాన్ ఖాన్.. మలయాళ పోస్టర్ ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్, తెలుగు మోషన్ పోస్టర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

Read Also : ‘ఇండియన్ 2’ లో కమల్ హాసన్ లుక్ చూశారా!

పోలీస్ గెటప్‌లో ‘తలైవా’ లుక్ అదిరిపోయింది.. తన స్టైల్ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు.. దర్బార్‌లో ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు సూపర్‌స్టార్.. సంతోష్ శివన్ విజువల్స్, అనిరుధ్ ఆర్ఆర్ బాగున్నాయి. నయనతార కథానాయికగా నటించిన ‘దర్బార్’.. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది..