సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్నయాక్షన్ ఎంటర్ టైనర్.. ‘దర్బార్’.. సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోమవారం సాయంత్రం ‘దర్బార్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
రజినీ తన రౌడీలను రఫ్ఫాడించడడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. ‘వాడు పోలీసాఫీసరా సార్’ అనడిగితే ‘హంతకుడు’ అని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ‘ఆదిత్య అరుణాచలం కమీషనర్ ఆఫ్ పోలీస్ ముంబాయ్’ అంటూ రజనీ తనను పరిచయం చేసుకునే డైలాగ్ బాగుంది.
‘ఆఫీసర్స్.. పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్.. వుయ్ లీవ్ టు ప్రొటెక్ట్.. వుయ్ డై టు సర్వ్.. గేమ్ ఆడుతున్నారా.. మనతో.. సార్ వాళ్లకి చెప్పండి పోలీసుల దగ్గరకి లెఫ్ట్‌లో రావచ్చు, రైట్‌లో రావచ్చు.. స్ట్రైట్‌గా రావొద్దని.. ఒరిజినల్‌గానే విలన్‌ని అమ్మా.. ఇదెలా ఉంది.. వంటి పంచులు బాగా పేలాయి. ఇక ట్రైలర్ చివర్లో ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ అని పాడుకుంటూ రజనీ తన స్టైల్‌లో నడుచుకుంటూ రావడం అదిరిపోయింది. సంతోష్ శివన్ విజువల్స్, అనిరుధ్ ఆర్ఆర్ బాగున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘దర్బార్’ తమిళ్, తెలుగులో భారీగా విడుదలవుతోంది.