ప్రభాస్‌కు వార్నర్ విషెస్..

  • Published By: sekhar ,Published On : October 23, 2020 / 07:17 PM IST
ప్రభాస్‌కు వార్నర్ విషెస్..

Updated On : October 23, 2020 / 7:40 PM IST

Prabhas-David Warner Birthday Wishes: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం.. అందరితోనూ కలిసిపోయే గుణం.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే తన 41వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డార్లింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ డార్లింగ్‌కు వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఇప్పటికే పలు టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్న వార్నర్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వార్నర్ ‘బాహుబలి’ సినిమాలో ‘‘అమరేంద్ర బాహుబలి అను నేను’’ అనే డైలాగ్ చెప్పిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్‌కు విషెస్ తెలిపింది.