Kalanithi Maran : నిర్మాతపై మనీలాండరింగ్‌ ఆరోపణలు.. అల్లు అర్జున్ సినిమా పరిస్థితి ఏంటి.. అసలే భారీ బడ్జెట్..

తాజాగా నిర్మాత కళానిధి మారన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.

Dayanidhi Sends Legal Notice to Allu Arjun Atlee Movie Producer Kalanithi Maran

Kalanithi Maran : అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్షర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

తాజాగా నిర్మాత కళానిధి మారన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. కళానిధి మారన్ తో పాటు మరో ఏడుగురికి ఆయన సోదరుడు దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో కళానిధి మారన్ మనీలాండరింగ్ తో పాటు పలు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడు అని ఆరోపించారు. ఇందుకు గాను కళానిధి మారన్ పై, సన్ టీవీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని, కంపెనీ లావాదేవీలు చెక్ చేయాలని ప్రభుత్వంను కోరారు దయానిధి మారన్.

Also Read : Nara Bhuvaneswari : హ్యాపీ బర్త్ డే పెద్ద అత్తయ్య.. సీఎం చంద్రబాబు భార్యకు హీరోయిన్ స్పెషల్ విషెస్..

తమిళ పరిశ్రమలో అగ్ర నిర్మాత, పలు వ్యాపారాలలో పెద్ద వ్యాపారవేత్తపై ఇలా మనీ లాండరింగ్ ఆరోపణలు సొంత సోదరుడే చేయడంతో తమిళనాట చర్చగా మారింది. ఐపీఎల్ లో SRH టీమ్ కి కూడా వెళ్లే ఓనర్స్. ఈ ఆరోపణలతో అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు ఎఫెక్ట్ పడుతుందా? అసలే 800 కోట్ల సినిమా అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై అధికారికంగా సన్ టీవీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.