Lady Singham : లేడీ సింగంని పరిచయం చేసిన బాలీవుడ్.. ఈసారి కూడా త్రిబుల్ బొనాంజా..

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి ఇప్పుడు లేడీ సింగం రాబోతుంది.

deepika padukone as Lady Singham in Rohit Shetty Cop Universe

Lady Singham : బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.. సౌత్ సినిమాలు సింగం, టెంపర్ రీమేక్స్ తో హిందీలో ఒక కాప్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ తో ‘సింగం1, సింగం2’, రణవీర్ సింగ్ తో ‘సింబా’, అక్షయ్ కుమార్ తో ‘సూర్యవంశీ’ సినిమాలను కాప్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ యూనివర్స్ లో భాగంగా సింగం 3 ని తీసుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టారు. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ లో వస్తున్న ఈ సినిమాలో రణవీర్ ‘సింబా’గా కనిపించబోతున్నాడు.

ఇక ఇదే సినిమాలో మరో పాత్రని పుట్టించి.. రోహిత్ శెట్టి తన సినిమాటిక్ యూనివర్స్ లోని మరో హీరోని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు. ‘దీపికా పదుకొనె’ని లేడీ సింగంగా ఈ సినిమాలో పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ చివరిగా వచ్చిన ‘సూర్యవంశీ’ సినిమాలో అక్షయ్, అజయ్ దేవగన్, రణవీర్ కనిపించి ఆడియన్స్ కి త్రిబుల్ బొనాంజా యాక్షన్ ని ఇచ్చారు. ఇప్పుడు సింగం 3 లో దీపికా రాకతో.. దీనిలో కూడా త్రిబుల్ బొనాంజా ఉండబోతుందని అర్ధమవుతుంది.

Also read : Shankar Dada MBBS : ఇన్‌ఫ్రాంట్ దేర్ ఈజ్ కామెడీ కార్నివాల్‌.. ‘శంకర్ దాదా’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

లేడీ సింగం అంటూ మూవీలోని దీపికా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దీపికా లుక్ చూస్తుంటే.. రణవీర్ ‘సింబా’ ఫిమేల్ వెర్షన్ అన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ లేడీ సింగం ఎలాంటి యాక్షన్ తో అదరగొట్టబోతుందో చూడాలి. ‘సింగం ఎగైన్’గా వస్తున్న ఈ మూడో భాగం.. వచ్చే ఏడాది ఆగష్టులో రిలీజ్ కాబోతుంది. కాగా సింగం 1 సూపర్ హిట్ అయ్యింది. కానీ సింగం 2 మాత్రం సోసోగా అలరించింది. మరి ఈ మూడో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.