JNU స్టూడెంట్స్‌ను కలిసిన దీపికా

ఢిల్లీలోని JNU క్యాంపస్‌లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్‌ను గాయపరిచారు. బాధితులను కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అక్కడికి వెళ్లారు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. గాయాలకు గురైన ఐషే ఘోష్‌తో పాటుగా మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ కూడా అక్కడ సమావేశమయ్యారు. 

సాయంత్రం 7గంటల 30నిమిషాల ప్రాంతంలో దీపికా అక్కడకు వచ్చి ఓ పదిహేను నిమిషాలు విద్యార్థులను కలిసి మాట్లాడింది. వచ్చిన కాసేపటికే బీజేపీ నుంచి దీపికా పదుకొనె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ ఆదేశాలు అందాయట. బాలీవుడ్ ఏ కేటగిరీలో ఉన్న పెద్ద స్టార్స్ అంతా మౌనంగా ఉన్నప్పటికీ దీపికా తీసుకున్న నిర్ణయానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తుంది. 

 

దీనిపై మాట్లాడిన దీపికా.. ‘నేను గర్విస్తున్నాను. ఇటువంటి దాడులు జరిగినా మనోళ్లు భయపడలేదు. మనదేశ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాం. వీధుల్లోకి.. బయటకు వచ్చి జనాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం మంచి విషయం. మార్పు కోరుకుంటే ఇది చాలా ముఖ్యం’ అని వెల్లడించారు. 

ఆదివారం కొందరు ముసుగు వ్యక్తుల భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావించే జేఎన్‌యూలోకి చొరబడి విద్యార్థులను కర్రలతో, రాడ్లతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఆందోళన చేస్తున్న బాధితులపై చర్యలు తీసుకున్నారు. యూనియన్ అండ్ ద టీచర్స్ అసోసియేషన్.. దాడిలో బీజేపీతో సంబంధమున్న ఏబీవీపీ హస్తం ఉందంటూ ఆరోపిస్తుంది.