Site icon 10TV Telugu

Rajasaab : ప్రభాస్ సినిమా నిర్మాతలపై కోర్టులో పిటిషన్.. ఇబ్బందుల్లో రాజాసాబ్ సినిమా?

Delhi Based IVY Entertainment Filed Petition in Delhi Court on Rajasaab Movie Producers

Rajasaab

Rajasaab : ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో ఈ సినిమా హారర్ కామెడీగా తెరకెక్కుతుంది. రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె నడుస్తుండటంతో షూటింగ్ ఆగింది.

రాజాసాబ్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.ఇటీవల డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరం సంక్రాంతికి వాయిదా పడేలా ఉందని సమాచారం. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ప్రభాస్ రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

Also Read : ముంబైలో రెస్టారెంట్ పెట్టి.. అక్కడే సెటిల్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు..

IVY ఎంటెర్టైన్మెంట్ పిటిషన్ ప్రకారం.. ఆ సంస్థ రాజాసాబ్ సినిమాల్లో 218 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు, అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ లో హక్కులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అలాగే సినిమాని ఎలాంటి పోటీ లేని సమయంలో సింగిల్ రిలీజ్ గా వచ్చేలా చూడాలని కూడా అనుకున్నట్టు, కానీ షూటింగ్ ఇంకా అవ్వలేదని, సినిమా అప్డేట్స్ ఇవ్వట్లేదని, తాము చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని, సినిమాని వాయిదా వేస్తున్నారని ఆరోపించింది.

ఈ ఆరోపణలు అన్ని చేస్తూ పెట్టిన పెట్టుబడికి 18 శాతం వడ్డీతో కలిపి మొత్తం చెల్లించాలని అంతవరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకు సినిమాపై ఎలాంటి హక్కులు ఉండకుండా, సినిమా టైటిల్ వాళ్ళు దోపిడీ చేయకుండా నిరోధించాలని ఈ పిటిషన్ లో తెలిపింది. మరి ఢిల్లీ హైకోర్టు దీనిపై ఏం చెప్తుందో చూసి పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ స్పందిస్తుందేమో చూడాలి.

Also Read : Rashmika Mandanna : సెలబ్రిటీలకు గిఫ్ట్స్ పంపిస్తున్న రష్మిక.. మై డియర్ రష్ అంటూ బన్నీ పోస్ట్.. ఏం పంపిస్తుందో తెలుసా?

Exit mobile version