Demon Pavan has walked out from Bigg Boss 9 with 15 lakh suitcase
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ టాప్ 5లో నిల్చిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్. అగ్నిపరీక్షలో సత్తా చాటి టాప్ 5 వరకు చాలా కష్టపడి ఆది గెలుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత దూరం రావడం అంటే మాములు విషయం కాదు. ఎదురైనా ప్రతీ సవాల్ ను తన ఆటతో మాత్రమే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే ఆడియన్స్ కి నచ్చాడు, అందుకే టాప్ 3 వరకు వచ్చాడు. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ అయ్యే అవకాశం ఉద డెమోన్ పవన్ కి ఉండేది. కానీ, మధ్యలో మరో కంటెస్టెంట్ రీతూ చౌదరి తో చేసిన ఫ్రెండ్ షిప్ కాస్త మిస్ ఫైర్ అయింది.
ఆ విషయంలో ఆడియన్స్ సైతం డెమోన్ ని నెగిటీవ్ చేశారు. కానీ ఎప్పుడైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యిందో , అప్పటి నుండి డిమోన్ పవన్ విశ్వరూపం చూపించేసాడు అని చెప్పాలి. టాస్కుల్లో ఇచ్చి పడేశాడు. అంతేకాదు, తనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఆ విషయంలో గత రెండు వారాలుగా ఇమ్మానుయేల్ ని సైతం డామినేట్ చేసేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే, ఆడియన్స్ కూడా ఇమ్మానుయేల్ కంటే డెమోన్ పవన్ కె ఎక్కువ వోటింగ్ వేశారు.
నిజానికి కాస్త ముందు నుంచే ఈ యాంగిల్ చూపించి ఉంటె తప్పకుండా విన్నర్ అయ్యేవాడు డెమోన్ పవన్. అయితే, తన కష్టానికి ఫలితంగా చివరి నిమిషంలో అద్భుతమైన అవకాశం దక్కింది. టాప్ 3లో డెమోన్ ఉన్నప్పుడు రూ.15 లక్షల సూట్ కేసు తో రవితేజ, ఆషిక రంగనాథ్ హౌస్ లోకి వచ్చారు. టాప్ 2 కంటెస్టెంట్స్ ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారు. కానీ, స్మార్ట్ గా ఆలోచించిన డెమోన్ పవన్ ఆ సూట్ కేసు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలా, రూ.15 లక్షల ఆఫర్ దక్కించుకున్నాడు. దాదాపు 15 వారలు ఇంట్లో ఉన్న డెమోన్ పవన్ ఏకంగా రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, విన్నర్ కళ్యాణ్ పడాల ప్రైజ్ మనీలో రూ.15 లక్షలు మినహాయించగా రూ.35 లక్షలు మాత్రమే అతను అందుకోనున్నాడు.