Devi Sri Prasad : సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా అందరికి సొంతమే.. అలా చెప్పడం తప్పు.. DSP కామెంట్స్ వైరల్..

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ కి సంబంధిచి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Devi sri Prasad Comments on Movie Result goes Viral

Devi Sri Prasad : ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోయిన దేవిశ్రీ ప్రసాద్ గత కొన్నాళ్లుగా భారీ సినిమాలు అడపాదడపా చేస్తున్నాడు. అయితే సినిమాల కంటే కూడా ఈ మధ్య ఎక్కువగా లైవ్ కాన్సర్ట్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ మీదే ఫోకస్ చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్ అనిపిస్తుంది. త్వరలో హైదరాబాద్ లో జరిగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ కి సంబంధిచి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో దేవి శ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అనేక సినిమాలు గురించి, సినీ పరిశ్రమ గురించి పలు అంశాలు మాట్లాడారు దేవిశ్రీ. ఈ క్రమంలో దేవిశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Pushpa : మావోయిస్టు ప్రాంతంలో పుష్ప 50 రోజులు ఆడింది.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అయితే ఎలా అయితే అందరికి సొంతమో ఫెయిల్ అయితే కూడా అలాగే అందరికి సొంతమే. నేను బాగా చేసాను, వాళ్ళు చేయలేదు అని చెప్పడమే ఒక టెక్నిషియన్ లేదా ఒక క్రియేటివ్ పర్సన్ చేసే మొదటి తప్పు. మేము అంతా సమాధానంగా ఉండాలి సినిమాకు అని అన్నారు.

దీంతో దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే పలువురు మెగాస్టార్ యాంటీ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలని మళ్ళీ ఆచార్య సినిమాకు, చిరంజీవికి, కొరటాల శివకు ఆపాదించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.