Devi Sri Prasad Reveals Interesting Fact about Allu Arjun Movie
Allu Arjun : అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్.. ఇలా ప్రతీదీ నెక్ట్స్ లెవల్లో ఉండాలంటూ అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప తో అల్లు అర్జున్ గ్రాఫే మారిపోయింది. అప్పటి వరకు జస్ట్ తెలుగు హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఏదో పేరుకు మాత్రమే పాన్ ఇండియా స్టార్ కాదు, ఆ రేంజ్ క్రేజ్, రేంజ్ పెంచేసుకున్నారు. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు, బాలీవుడ్ లో చేసిన రికార్డుల రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే నెక్ట్స్ తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ ని కూడా అంతకుమించి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also See : Sreemukhi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ శ్రీముఖి సత్యనారాయణ స్వామి వ్రతం.. ఫోటోలు చూశారా?
కానీ అల్లు అర్జున్ మనసులో మాత్రం వేరే సినిమా ఉందంటున్నారు దేవిశ్రీప్రసాద్. అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చెయ్యాలనుందో చెప్పారు దేవి శ్రీ ప్రసాద్. బన్నీకి ప్యూర్ లవ్ స్టోరీ చెయ్యాలనుందని, ఆ సినిమాలో అన్నీ మంచి మెలొడీ లవ్ సాంగ్సే ఉండాలని కోరుకుంటున్నారని, ఆ విషయం ఆల్రెడీ దేవీతో డిస్కస్ చేశారని రివీల్ చేశారు. దాంతో వరసగా యాక్షన్ సినిమాలు చేస్తూ విపరీతమైన వయెలెన్స్ చూపిస్తున్న బన్నీకి మనసులో ఆర్య లాంటి ప్యూర్ లవ్ స్టోరీ చెయ్యాలనుందని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హైలైట్ అవుతోంది.
వరసగా యాక్షన్ సినిమాలు చేస్తూ ఒక దానికి మించి ఒక సినిమా గ్రాండియర్, యాక్షన్, ఎలివేషన్ పెంచుకుంటూ పోతున్న బన్నీ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో అంటూ ఇమాజినేషన్ స్టార్ట్ అయ్యింది జనాల్లో. మరోసారి పక్క లవ్ స్టోరీ చెయ్యాలంటే బన్నీ ఎవరితో చేస్తారో, అసలు స్టోరీ ఎలా ఉండబోతుందో అంటూ నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు.
Also Read : Prabhas : ఫోటో ఇస్తారు లేదా కలుస్తారు.. ఈయనేంటి.. ప్రభాస్ తన ఫ్యాన్ ని హీరోని చేస్తున్నాడా?
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. మైథలాజికల్ టచ్ ఉండే సినిమా అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ నుంచే ఈ సినిమా వర్క్ మొదలవుతాయని నిర్మాతలు కూడా అంటున్నారు. త్రివిక్రమ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ, పుష్ప 3 సినిమాలు కూడా ఉన్నాయి. మరి వరుసగా భారీ సినిమాలు పెట్టుకొని అల్లు అర్జున్ లవ్ స్టోరీ ఎప్పుడు తీస్తాడో చూడాలి.