Dhamaka movie collected 50 crores
Dhamaka : మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కమ్ బ్యాక్ ఇచ్చాడు అనుకుంటే, ఆ వెంటనే రెండు భారీ డిజాస్టర్స్‌తో ఆడియన్స్‌ని పలకరించాడు. దీంతో మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కేందుకు తనలోని మాస్‌తో పాటు ఒకప్పటి కామెడీ టైమింగ్‌ని కూడా చూపిస్తూ చేసిన సినిమానే ‘ధమాకా’. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్టు టాక్ ని సొంతం చేసుకొని రోజురోజకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.
Dhamaka : థియేటర్ల వద్ద దుమ్ము రేపుతున్న ‘ధమాకా’..
రవితేజ డ్యూయల్ రోల్ కనిపించి డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటిరోజే రూ.10 కోట్లు పైగా కలెక్షన్స్ అందుకొని రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది. నాలుగు రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లు గ్రాస్, రూ.21 కోట్లు షేర్ రాబట్టి.. నాలుగు రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు లాభాలు లెక్కపెట్టుకొనే పనిలో పడ్డారు. 5 రోజుల్లో రూ.50 కోట్లు మార్క్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ ధమాకా చూపిస్తుంది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు ఏవి విడుదల లేవు, ఇదే రేంజ్‌లో ‘ధమాకా’ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తే 100 కోట్ల క్లబ్‌లో చేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రవితేజ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు? లేదా? అనేది చూడాలి.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive 5️⃣ Days
BoxOffice Rampage ?#DhamakaBlockBuster in Cinemas Now ??#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/7xAKb4X78o
— People Media Factory (@peoplemediafcy) December 28, 2022