Site icon 10TV Telugu

Dhanush – Mrunal Thakur : నిజంగానే ధనుష్ – మృణాల్ డేటింగ్ చేస్తున్నారా? ముంబైలో మీటింగ్..

Dhanush Mrunal Thakur in Love Relation Rumors Goes Viral

Dhanush - Mrunal Thakur

Dhanush – Mrunal Thakur : తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే కొన్నాళ్ల క్రితం ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ధనుష్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో తెగ వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకు చెందిన ఓ పార్టీలో ధనుష్ కూడా కనిపించాడు. అదే పార్టీలో మృణాల్ పుట్టిన రోజు వేడుకలను కూడా సెలబ్రేట్ చేసారు. ఈ వేడుకలకు ధనుష్ హాజరయ్యాడని టాక్. పార్టీలో ధనుష్, మృణాల్ చాలా క్లోజ్ గా ఉండటం,హగ్స్ ఇచ్చుకోవడం, సెల్ఫీలు దిగడం.. ఇవన్నీ చూసి మృణాల్ -ధనుష్ డేటింగ్ లో ఉన్నారని అంతా భావిస్తున్నారు. ధనుష్ – మృణాల్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Chiranjeevi : టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్.. మెగాస్టార్ తో నిర్మాతల భేటీ.. చిరంజీవి ఏమన్నారంటే..

బాలీవుడ్ లో అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నది నిజమే అంటున్నారు. అయితే ఈ వార్తలు అన్ని చూసి అసలు వాళ్లిద్దరూ కలిసే నటించలేదు, వాళ్లిద్దరూ గతంలో ఎప్పుడూ కలవలేదు, ముంబైలో ఇప్పుడు ఎందుకు కలిశారు? వీరిద్దరూ ఎలా రిలేషన్ లో ఉన్నారు అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై మృణాల్ కానీ, ధనుష్ కానీ ఇంకా స్పందించలేదు.

ఇక ధనుష్ త్వరలో ఇడ్లీ కడై సినిమాతో రానున్నాడు. మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ త్వరలో అడివిశేష్ డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ చేతిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి.

Also Read : Anasuya – Rashmi : అనసూయ – రష్మీ మాట్లాడుకోవట్లేదా..? జబర్దస్త్ స్టేజిపై ఏడ్చేసిన రష్మీ.. అనసూయ ఎమోషనల్.. ప్రొమో వైరల్..

Exit mobile version