Maestro : మ్యూజికల్ బయోపిక్.. ఇళయరాజాగా ధనుష్ కొత్త సినిమా..!

మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నాడట.

Dhanush to play music director Ilaiyaraaja biopic maestro

Maestro : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా బయోపిక్ లో నటించబోతున్నాడట. ప్రముఖ సీనియర్ పాత్రికేయురాలు లతా శ్రీనివాసన్.. ఈ విషయం గురించి ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే.. ఇయాళయరాజా బయోపిక్ లో ధనుష్ నటించబోతున్నాడని, ఈ ప్రాజెక్ట్ 2024లో పట్టాలు ఎక్కబోతుందని, 2025లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతుందని ఆమె పేర్కొంది. ఇక ఈ సినిమాని ‘కనెక్ట్ మీడియా’ నిర్మించబోతుందట.

‘మాస్ట్రో’ అనే టైటిల్ ని పెట్టబోతున్నారట సినిమాకి. కొన్ని నెలలు క్రిందట యువన్ శంకర్ రాజా కూడా ఈ బయోపిక్ గురించి మాట్లాడినట్లు ఆమె వెల్లడించింది. తన తండ్రి పాత్రలో ధనుష్ ని చూడడం చాలా సంతోషంగా ఉన్నట్లు యువన్ చెప్పుకొచ్చాడట. ఈ బయోపిక్ న్యూస్ పక్కా నమ్మదగిన సమాచారం అని చెబుతున్నారు. మరి మూవీ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ బయోపిక్ ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. కాగా ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో నటిస్తున్నాడు.

Also read : Animal Movie : యానిమల్ సినిమా రన్ టైం మరీ అంతా? ప్రేక్షకులు థియేటర్స్ లో అంత సేపు కూర్చుంటారా?

ఆ తరువాత శేఖర్ కముల దర్శకత్వంలో ఒక సినిమా, సొంత డైరెక్షన్ లో ఒక చిత్రం చేయనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తో ఆడియన్స్ లో ఒక సందేహం మొదలయింది. ధనుష్ సొంత దర్శకత్వంలో తెరకెక్కించేబోయే సినిమా ఈ బయోపిక్ అయ్యుంటుందా..? అని ప్రశ్న వేలెత్తుతున్నారు. మరి ఈ బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. కాగా ఇళయరాజా 1000 పైగా సినిమాల్లో 7000 కు పైగా సాంగ్స్ ని చేశారు. 50 ఏళ్ళ కెరీర్ లో 20,000 పైగా కాన్సర్ట్స్ ఇచ్చారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.