Dharma : సినిమాల్లో హీరోగా సక్సెస్.. పోలీస్ కేసు పెట్టిన భార్య..

ఏపీ కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ కి చెందిన కాకాని ధర్మ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.(Dharma)

Dharma

Dharma : ఇటీవల సింధూరం, డ్రింకర్ సాయి అనే సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేశ్ అలియాస్ ధర్మ(Dharma). తాజాగా ఈ హీరోపై తన భార్య పోలీస్ కేసు పెట్టింది.

వివరాల్లోకి వెళితే..

ఏపీ కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ కి చెందిన కాకాని ధర్మ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల డ్రింకర్ సాయి సినిమాతో పర్వాలేదనిపించి మంచి విజయం సాధించాడు. మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Also See : Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఫొటోలు చూశారా?

ధర్మకు 2013లో సోషల్ మీడియాలో చిరుమామిళ్ల గౌతమి అనే అమ్మాయి పరిచయం అయింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి 2019లో పెళ్లి చేసుకున్నా రు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. గౌతమి తండ్రి ఆర్థిక సాయంతో భార్యాభర్తలు ఇద్దరూ ఏపీ, హైదరాబాద్లో రెస్టారెంట్లను ప్రారంభించారు. బిజినెస్ మంచిగా రన్ అవ్వడం, సినిమా అవకాశలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడ్డ ధర్మ భార్యను వేధింపులకు గురిచేయడం, తన పలుకుబడి పెరిగిందని మరింత కట్నం ఇవ్వాలని వేధించాడట.

అయినప్పటికీ గౌతమి పేరెంట్స్ రెండు కార్లు, రెస్టారెంట్ బిజినెస్ కు డబ్బులు ఇచ్చినా ధర్మ తీరు మారలేదు. ఆల్రెడీ గౌతమి షీ టీమ్ కి ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా ధర్మ మారకుండా అదనపు కట్నం కోసం భార్యని వేధించడంతో తాజాగా భర్త, అత్తమామలు, ఆడ బిడ్డ వేధింపులపై గౌతమి ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also See : Sridevi Vijaykumar : ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ ‘శ్రీదేవి’ రీ ఎంట్రీ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఫొటోలు..