Dhee Raju
Dhee Raju : ఢీ షోలో టైటిల్ గెలిచి ఫేమ్ తెచ్చుకున్నాడు రాజు. ఇప్పుడు డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, పలు టీవీ షోలు, సాంగ్స్ తో బిజీగానే ఉన్నాడు రాజు. డ్యాన్సర్ గా మంచి పేరే తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తన బ్రేకప్ స్టోరీ చెప్పుకొచ్చాడు.(Dhee Raju)
రాజు తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ఒక రెండేళ్ల క్రితం బ్రేకప్ అయింది. అప్పుడు ఇద్దరిది అన్ మెచ్యూర్ మైండ్. ఇద్దరికీ మెచ్యూరిటీ లెవల్స్ లేవు. ఒకర్నొకరు అర్ధం చేసుకోలేక విడిపోయాం. ఇప్పటికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని అప్పుడప్పుడు తెలుసుకుంటాను. ఇంకొంత కాలం నేను అయినా వెయిట్ చేసి ఉంటే బాగుండేది. పెళ్లి చేసుకునేవాళ్లం ఏమో. నేను గొడవలు పడకుండా ఉంటే కలిసి ఉండేవాళ్ళం ఏమో.
ఫోన్ చేసి సారీ చెప్పాను. తను లేకపోతే నేను బతకలేను అనేంత దూరం వెళ్ళాను. తను వెళ్ళిపోయాక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. తను పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనేలా ఉండేది. నాకే కాదు అబ్బాయిల అందరికి ప్రేమించిన అమ్మాయి దూరం అయితే అలాగే ఉంటుంది. నేను తనను బాధపెట్టాను. తన కాళ్ళు పట్టుకొని అయినా ఒప్పించాలి అనిపించింది. కానీ తనకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజు.
అలాగే.. ప్రస్తుతం ఎవర్ని లవ్ చెయ్యట్లేదు. నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. ఫ్యూచర్ లో పెళ్లి మాత్రం చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.
Also Read : Dhee Raju : చైతన్య మాస్టర్ సూసైడ్ ముందు లాస్ట్ కాల్ నాకే.. నేను ఏమైపోతానో అని అందరూ.. రాజు ఎమోషనల్..