Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా.. నిర్మాత కామెంట్స్ వైరల్.. వంద సుమోలు గాల్లోకి..
నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Kiran Abbavaram)
- Saketh U
- Published on- November 5, 2026 / 05:21 PM IST
Kiran Abbavaram
Kiran Abbavaram : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇప్పటికే క, కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో హిట్స్ కొట్టాడు. త్వరలో రియాలిటీ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా చేసాడు. రియాలిటీ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
తాజాగా కిరణ్ సబ్బవరం సమ్మర్ హాలిడేస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సినిమా నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నా జీవితంలో నాకు ఒక సినిమా చేయాలని ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం గారితో సినిమా తీయాలి. చాలా రోజులైంది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి. ఈ సారి గాల్లో వంద సుమోలు లేపుతాము అని అన్నారు.
గతంలో బాలయ్య, చిరంజీవి.. పలువురు హీరోలు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల్లో సుమోలు గాల్లోకి ఎగిరే సీన్స్ ఇప్పటికి గూస్ బంప్స్ ఇస్తాయి. ఇప్పుడు ధీరజ్ మొగిలినేని కిరణ్ అబ్బవరంతో అలాంటి సినిమా చేస్తానని ప్రకటించడంతో ఆసక్తి నెలకొంది. స్వతహాగా రాయలసీమ నుంచి వచ్చిన కిరణ్ అబ్బవరం మరి రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా చేస్తాడా? గాల్లోకి సుమోలు లేపుతాడా చూడాలి.
