Naga Chaitanya : క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు నాగచైతన్య చేయూత..

సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న నాగచైతన్య.. కొంత సమయం క్యాన్సర్‌ భాదిత పిల్లలకు కేటాయించి గొప్ప మనసుని చాటుకున్నారు.

Dhootha fame Naga Chaitanya help for cancer effected Childrens

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య తన కొత్త ప్రాజెక్ట్స్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఒక పక్క తాను నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’ రిలీజ్ కి సిద్దమవుతుండడంతో.. ఆ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మరో పక్క తాను నటించబోయే NC23 కోసం భారీ కసరత్తలు, హోమ్ వర్క్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో పాల్గొంటున్నారు. ఇంతటి బిజీ లైఫ్ లో కూడా చైతన్య.. కొంత సమయం క్యాన్సర్‌ భాదిత పిల్లలకు కేటాయించి గొప్ప మనసుని చాటుకున్నారు. అంతేకాదు వారికి తన వంతు సహాయం కూడా అందించారు.

ఈ చిల్డ్రన్స్ డేని చైతన్య.. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో కొంత సమయాన్ని గడిపి వారి ముఖాల్లో నవ్వులు నిప్పారు. ఆ పిల్లల కబుర్లు వింటూ, వారితో ఆడుతూ హ్యాపీ టైం స్పెండ్ చేశారు. అంతేకాదు ఆ పిల్లలకు అవసరమైన మెడిసిన్స్ అండ్ ఫుడ్ కూడా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి చూసిన నెటిజెన్స్ నాగచైతన్యని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Chiranjeevi – Raviteja : చిరు, రవితేజ సినిమాలు పట్టాలు ఎక్కేది అప్పుడేనట..

ఇక నాగచైతన్య ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చైతన్య ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారు. నాగచైతన్య నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో దీని పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే, చందూ మొండేటి దర్శకత్వంలో తన చేయబోయే NC23 కోసం నాగచైతన్య చాలా హోమ్ వర్క్ చేస్తున్నారు. యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ మూవీ లవర్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.