Chiranjeevi – Raviteja : చిరు, రవితేజ సినిమాలు పట్టాలు ఎక్కేది అప్పుడేనట..

ఆన్ స్క్రీన్ బ్రదర్స్ చిరంజీవి, రవితేజ తమ కొత్త సినిమాల షూటింగ్స్ ని పట్టాలు ఎక్కించడానికి సిద్ధమవుతున్నారు.

Chiranjeevi – Raviteja : చిరు, రవితేజ సినిమాలు పట్టాలు ఎక్కేది అప్పుడేనట..

Chiranjeevi Mega156 Raviteja RT4GM shooting updates

Chiranjeevi – Raviteja : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ తమ కొత్త సినిమాల షూటింగ్స్ ని పట్టాలు ఎక్కించడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి బింబిసారా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తన 156వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ మూవీ.. షూటింగ్ కి ఎప్పుడు వెళ్తుందని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కనుంది.

ఈ సినిమా దాదాపు 70శాతం స్పెషల్‌ ఎఫెక్ట్‌లు పైనే తెరకెక్కబోతుందంటూ దర్శకుడు తెలియజేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఇక ఇన్ని రోజులు వరుణ్ పెళ్లి, దివాళీ అంటూ సెలబ్రేషన్స్ లో ఉన్న చిరు.. ఇప్పుడు మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్‌ 25 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందంట. మారేడుమిల్లి అడవుల్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే చిరంజీవి మాత్రం డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతారట.

Also read : Tiger Nageswara Rao : చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు..

ఇక రవితేజ విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బలుపు, డాన్ శీను, క్రాక్ వంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న మాస్ మహారాజ్ ఇప్పుడు మరోసారి ఆ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. RT4GM వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో మొదలు కానుందట. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియాంక మోహన్ నటించబోతున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పై రవితేజ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.