Tiger Nageswara Rao : చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు..
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఏ చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేశాడు.

Raviteja Tiger Nageswara Rao ott streaming details
Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ నుంచి ఈ దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ మూవీతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టారు.
ఇక మంచి కాంపిటీషన్ ఉన్న సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గజదొంగ ఏ చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి హిందీ వెర్షన్ ని ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లో రిలీజ్ చేయనున్నారో చూడాలి. మరి థియేటర్ లో మిస్ అయిన వారు ఉంటే ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.
Also read : NTR : ఆ విషయంలో ఎన్టీఆర్ ఒకేలా ఉంటారు.. అల్లు శిరీష్ పోస్టు వైరల్..
కాగా రవితేజ ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం తరువాత రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. RT4GM వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 23 నుండి హైదరాబాద్ లో మొదలు కానుందట. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో రవితేజ సరసన నటించబోతున్నారని సమాచారం. ఈ మూవీ పై రవితేజ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.