×
Ad

Bison OTT: ఓటీటీకి వస్తున్న కొత్త సినిమా ‘బైసన్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?

తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బైసన్. దర్శకుడు మారి సెల్వరాజ్(Bison OTT) తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

Dhruv Vikram Bison movie to stream on Netflix from November 21st

Bison OTT: తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బైసన్. దర్శకుడు మారి సెల్వరాజ్ (Bison OTT)తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత మాత్రం అంతగా ఆదరణ లభించలేదు. తెలుగులో ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో విడుదలై నెలరోజులు కూడా గడవక ముందే ఈ సినిమాను ఓటీటీకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.

Sai Durgha Tej: తిరుమలలో హీరో సాయి దుర్గ తేజ్.. పెళ్లిపై ప్రకటన.. వచ్చే ఏడాది ముహూర్తం..

బైసన్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న బైసన్ సినిమాకు ఓటీటీ ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.