Dhruva Vaayu Kalinga Movie Firts Look and Title Launched by Vijayendra Prasad
Kalinga : ఇటీవల కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ క్రమంలో కిరోసిన్ సినిమా ఫేమ్ ధృవ వాయు ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాతో రాబోతున్నారు. ధృవ వాయు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also See : Gladiator 2 : గ్లాడియేటర్ 2 ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆసక్తిగానే ఉంది.
పోస్టర్‌లో కాగడా పట్టుకొని హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.