×
Ad

Dhurandhar 2 Teaser: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది.. అధికారిక ప్రకటన చేసిన టీం

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ సినిమా సీక్వెల్ టీజర్(Dhurandhar 2 Teaser) పై అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.

Dhurandhar 2 movie teaser will be played with Border 2 movie.

  • దురంధర్ 2 టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
  • బాబీ డియోల్ బార్డర్ 2 సినిమాతో ప్లే చేయనున్న మేకర్స్
  • మర్చి 19న దురంధర్ 2 విడుదల

Dhurandhar 2 Teaser: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియన్ ఆర్మీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా.. సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అక్షయ్ ఖన్నా స్పెషల్ రోల్ చేశాడు.

Ntr: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. ఆగిపోయిన డ్రాగన్ మూవీ షూటింగ్

ఇక ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ఆదిత్య ధర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ దురంధర్: ది రివెంజ్(Dhurandhar 2 Teaser) పేరుతో మార్చి 19న విడుదల అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీక్వెల్ కి సంబదించిన టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ టీజర్ ను బాబీ డియోల్ హీరోగా వస్తున్న బార్డర్ 2 సినిమా తోపాటు ప్లే చేయనున్నారట. ఇక బార్డర్ 2 సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే దురంధర్ 2 టీజర్ కి సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యిందట. 1 నిమిషం 48 సెకన్ల డ్యూరేషన్ లో ఈ టీజర్ రానందట. ఈ టీజర్ లో కూడా యాక్షన్ పాళ్ళు ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం. దీంతో, దురంధర్ సీక్వెల్ కోసం చూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మొదటి పార్ట్ తో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా రెండొవ పార్ట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. రెండు పార్ట్లులు కలిపి దంగల్ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్.