Ntr: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. ఆగిపోయిన డ్రాగన్ మూవీ షూటింగ్

ఎన్టీఆర్(Ntr) కి అనారోగ్యం కారణంగా డ్రాగన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.

Ntr: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. ఆగిపోయిన డ్రాగన్ మూవీ షూటింగ్

NTR Dragon movie shooting has stopped.

Updated On : January 21, 2026 / 9:36 AM IST
  • జ్వరంతో బాధపడుతున్న ఎన్టీఆర్
  • డ్రాగన్ సినిమా షూటింగ్ కి బ్రేక్
  • రెస్ట్ మోడ్ లోకి ఎన్టీఆర్

Ntr: దేవర లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘డ్రాగన్’. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఆ విడుదల తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక డ్రాగన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది జూన్ లో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆమధ్య ఎన్టీఆర్ కి చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.

Poojitha Ponnada: సొగసు తీగలా హొయలు పోతున్న పూజిత.. గ్లామర్ ఫొటోస్

కారణం ఏంటంటే, ఎన్టీఆర్(Ntr) గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. నిరవధికగా షూటింగ్ లో పాల్గొనడం వల్ల అలసట కారణంగానే జ్వరం వచ్చినట్టుగా డాక్టర్స్ సూచించారట. అందుకే, కనీసం మూడు రోజుల విరామం అవసరం అని చెప్పారట. అందుకే, డ్రాగన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడట ఎన్టీఆర్. దీంతో, ప్రస్తుతానికి డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగినట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది. 2026 జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, టోవినో థామస్ కీ రోల్స్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవి బాసృస్ సంగీతం అందిస్తున్నాడు.