×
Ad

Dhurandhar OTT: ఓటీటీలో దురంధర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

దురంధర్ సినిమా ఓటీటీ(Dhurandhar OTT) రన్ టైంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Dhurandhar movie now streaming on netflix OTT.

  • ఓటీటీలోకి వచ్చేసిన దురంధర్’
  • సినిమా రన్ టైంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్
  • కీలకమైన సీన్స్ తీసేశారంటూ కామెంట్స్

Dhurandhar OTT: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే రేంజ్ లో ఊహకు అందనంతగా ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ కి 3 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్స్ వచ్చారట. అంతలా ఈ సినిమా కోసం ఎదురుచూశారు ఆడియన్స్.

Satyasri: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నటి సత్యశ్రీ.. ఫోటోలు

అయితే, విడుదల తరువాత మాత్రం ఆడియన్స్ ఈ సినిమా మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం దురంధర్ సినిమా రన్ టైం. నిజానికి దురంధర్(Dhurandhar OTT) సినిమా థియేటర్స్ రన్ టైం వచ్చేసి 3:45 నిమిషాలు. కానీ, ఓటీటీలో మాత్రం 3:35 నిమిషాల రన్ టైంతో విడుదల చేశారు. దాంతో ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక సెన్స్ ను తీశేశారని, చాలా డైలాగ్స్ ని కూడా మ్యూట్ చేశారంటూ కూడా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాదు నెట్ ఫ్లిక్స్ పై కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించాడు. URI సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సారా అర్జున్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేసన్ క్రియేట్ చేసింది. కేవలం సింగల్ లాన్గ్వేజ్ లో విడువులై ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఓటీటీలో కూడా అదే రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అయ్యింది దురంధర్ సినిమా.