Dia Mirza Welcomed Boy : బాబుకు జన్మనిచ్చిన నటి దియా మిర్జా.. ఎమోషనల్ పోస్టు!

బాలీవుడ్ నటి దియా మిర్జా, వైభవ్ రేఖి ఈ ఏడాది మే నెలలోనే ఒక బాబుకు జన్మనిచ్చారు. కానీ, ఆ విషయాన్ని ప్రపంచానికి రెండు నెలల తర్వాత మాత్రమే షేర్ చేశారు. పుట్టిన బాబు గురించి తల్లి దియా మిర్జా భావోద్వేగ పోస్టు చేసింది.

Dia Mirza Welcomed Boy : బాబుకు జన్మనిచ్చిన నటి దియా మిర్జా.. ఎమోషనల్ పోస్టు!

Dia Mirza Welcomed Boy

Updated On : July 14, 2021 / 1:15 PM IST

Dia Mirza And Vaibhav Rekhi : బాలీవుడ్ నటి దియా మిర్జా, వైభవ్ రేఖి ఈ ఏడాది మే నెలలోనే ఒక బాబుకు జన్మనిచ్చారు. కానీ, ఆ విషయాన్ని ప్రపంచానికి రెండు నెలల తర్వాత మాత్రమే షేర్ చేశారు. పుట్టిన బాబు గురించి తల్లి దియా మిర్జా భావోద్వేగ పోస్టు చేసింది. నెలలు నిండక ముందే బాబు ( Avyaan Azaad) జన్మించాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి వచ్చిందని భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

దియా మిర్జా మే 14వ తేదీన బాబుకు జన్మనిచ్చింది. అయితే బాబు ఆరోగ్యంగా లేడని వైద్యులు చెప్పడంతో మిర్జా దంపతులు షాక్ అయ్యారు. Neonatal ICUలో ఉంచి చికిత్స అందించారు. తాను గర్భం దాల్చిన సమయంలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణంగా శిశువు ప్రాణానికి ముప్పు తెచ్చిందంటూ మిర్జా భావోద్వేగానికి లోనైంది.

తన కుమారుడి వేలును పట్టుకుని ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తన కుమారుడికి అవ్యాన్ ఆజాద్ రేఖి (Avyaan Azaad Rekhi) అని పేరు పెట్టారు. కొన్ని రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి శిశువు అవ్యాన్ ఇంటికి వస్తాడనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.