అందరు ఊహించినట్టే.. దిల్‌రాజ్.. ఆమిర్ ఖాన్ కాంబో బొమ్మ పడబోతోందా..? మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడా..? ఇప్పుడిదే గాసిప్.. టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారింది. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రచారంలో నిజమెంతా.. ఒక వేళ నిజమైతే బడ్జెట్ ఎంత.. ఆమిర్ ఖాన్‌ను డైరెక్ట్ చేసెదెవరు.. పక్కన స్టెప్పులేసేదెవరంటూ.. ఇలా ఎన్నో క్రేజీ గాసిప్స్ టాలీవుడ్ వీధుల్లో రీసౌండ్ చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక ఆయన గత నెలలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌ను మీట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అంటూ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.
దిల్‌రాజు-ఆమిర్ ఖాన్ కాంబో మూవీ స్ట్రయిట్ తెలుగు సినిమా అయినా, అది భారీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుందంటున్నారు. దిల్ రాజ్ బ్యానర్‌లో వచ్చే ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నట్లు మరో గాసిప్ మొదలైంది. ఇప్పటికే డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆమిర్ ఖాన్‌కు కథ కూడా వినిపించాడట సినిమా లైన్‌ను వినిపించగా ఆమిర్ ఖాన్ కూడా ఎగ్జైట్ అయ్యాడట.
ఆయనకు నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మరోవైపు దిల్‌రాజ్ కూడా పాన్ ఇండియా మూవీగా మలిచేందుకు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచారట. మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతుందన్నమాట.
బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సినిమాలు తీసిన దిల్‌రాజ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాడు. వారీస్ సినిమాలో తమిళ్ హీరో, తెలుగు డైరెక్టర్ అయితే, గేమ్‌ఛేంజర్ సినిమాలో తెలుగు హీరో, తమిళ్ డైరెక్టర్ ఉన్నారు. కానీ ఈసారి తెలుగు డైరెక్టర్.. హిందీ హీరో కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు దిల్ రాజ్. మరి దీని పై ఎప్పుడు అఫీషియల్ ప్రకటన వస్తుందో చూడాలి.
Chiranjeeva : పక్కా ఇండియన్ స్టైల్ లో చిరంజీవ.. హీరో ఎవరంటే..