Dil Raju : మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు..
తమిళ నటుడు విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వారసుడు'. ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని లేపేలా ఉన్నాయి.
- gum 95921
- Published On : December 16, 2022 / 02:00 PM IST
Dil Raju controversial words on tamil star hero ajith
Dil Raju : తమిళ నటుడు విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వారసుడు’. ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తెలుగులో సంక్రాంతికి బడా హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉండగా.. వాటిని కాదని దిల్ రాజు వారసుడు సినిమా కోసం ఎక్కువ థియేటర్లను ఆక్రమించాడని ఫిల్మ్ కౌన్సిల్ లో వాదనలు వినిపించడంతో, టాలీవుడ్ లో పెద్ద రచ్చే జరిగింది.
Dil Raju : ‘వారసుడు’ సినిమా మహేష్, చరణ్‌లను దాటి విజయ్‌కి వెళ్ళింది.. దిల్ రాజు!
తాజాగా ఇప్పుడు ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని లేపేలా ఉన్నాయి. వారసుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో థియేటర్ల సమస్య గురించి మాట్లాడుతూ.. “తమిళనాడులో అజిత్ కంటే విజయ్ చాలా పెద్ద స్టార్” అంటూ అజిత్ ని తక్కువ చేసి మాట్లాడాడు.
అసలే తమిళనాడులో విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉంటది పరిస్థితి. అలాంటిది దిల్ రాజు ఇప్పుడు ఏకంగా ఇటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్టేట్‌మెంట్ తమిళనాడులోని అజిత్ ఫ్యాన్స్ వరకు వెళితే, అక్కడ పరిస్థితులు ఏంటి? అసలే దిల్ రాజుకి ఇది మొదటి తమిళ సినిమా. ఇలాంటి సమయంలో వారిసు సినిమా పరిస్థితి ఏంటి? అంటూ నెటిజెన్ల కామెంట్లు చేస్తున్నారు.
