Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. సెప్టెంబర్ షూట్ అందుకే క్యాన్సిల్ అయ్యింది..

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. సెప్టెంబర్ షూట్ అందుకే క్యాన్సిల్ అయ్యిందంటూ..

Dil Raju Gave Ram Charan Game Changer update

Game Changer : రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వస్తుంది. దీంతో మెగా పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సెప్టెంబర్ ఒక షెడ్యూల్ జరగాల్సి ఉండగా.. అది ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. ఆ షెడ్యూల్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Lucky Baskhar : మొదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ షూట్..

తాజాగా నిర్మాత దిల్ రాజు మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. సెప్టెంబర్ లో కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ లేక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యినట్లు వెల్లడించాడు. ఆ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి మార్చినట్లు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇక ఈ అప్డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచి ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగనుందని తెలుస్తుంది. శంకర్ ఈ సినిమాతో పాటు ‘ఇండియన్ 2’ షూటింగ్ ని కూడా చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యిందట.

Gopichand 32 : ఇటలీలో శ్రీను వైట్ల, గోపీచంద్ మూవీ.. యాక్షన్ మూవీతో..

ఇక ఇప్పటినుంచి శంకర్ గేమ్ చెంజర్ పై ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో చరణ్.. ఫస్ట్ టైం ఫాదర్ అండ్ సన్ రోల్స్ చేస్తున్నాడు. అంతేకాదు చరణ్ ఈ సినిమాలో మరిన్ని డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. కియారా అద్వానీ (Kiara Advani) ఈ సినిమాలో మరోసారి చరణ్ కి జంటగా కనిపించనుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి లీక్ అయిన ఒక సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుంది.