Game Changer : గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చిన దిల్ రాజు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే..

గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ వరుస అప్డేట్స్ ఇచ్చారు దిల్ రాజు.

Dil Raju Gives Updates on Game Changer Movie Promotions

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్ ని నవంబర్ 9 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నో లో చేయబోతున్నట్టు కూడా తెలిపారు. అయితే తాజాగా నేడు దిల్ రాజు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తమిళ్ లో తన మిత్రుడు, డిస్ట్రిబ్యూట్ర్ తో కలిసి SVC ఆదిత్య రామ్ ఫిలిమ్స్ అని స్థాపించి తమిళనాడులో కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత భారీ, పాన్ ఇండియా సినిమాలు తమిళ్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు.

Also Read : Lokesh Kanagaraj : కమల్ హాసన్, రజినీకాంత్ తో సినిమా చేసేవాడిని.. కానీ.. లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ వరుస అప్డేట్స్ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9 రానుంది. ఈ ఈవెంట్ ను లక్నోలో నిర్వహిస్తున్నాము. ఆ తర్వాత అమెరికా డల్లాస్ లో ఒక ఈవెంట్ చేయబోతున్నాము. అనంతరం జనవరి మొదటి వారం ఏపీ, తెలంగాణలో ఒక ఈవెంట్ ఉంటుంది. జనవరి 10న సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

దీంతో రిలీజ్ కి ముందు జనవరి మొదటి వారంలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చేసారు. అయితే అది ఏపీ, తెలంగాణలో ఎక్కడ పెడతారో చూడాలి. ఇక డల్లాస్ లో కూడా ఈవెంట్ చేస్తున్నారు అంటే మాములు విషయం కాదు. మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమాకు పాన్ ఇండియా ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.