Dil Raju said Film distributors are the only ones who pay money without knowing or watching
Dil Raju : టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా సినీ కెరీర్ ని మొదలుపెట్టి తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత ‘దిల్ రాజు’. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి, ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం సినీ నిర్మాత మండలిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Unstoppable episode 5 : ఈసారి స్టార్ ప్రొడ్యూసర్‌ల వంతు.. అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్..
ఆ ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ లు ఎదురుకునే సమస్యలను తెలియజేశాడు. “ఒక సినిమా మొదలైనప్పుడు.. ఆ సినిమాకు డబ్బులు పెట్టే నిర్మాత, నటించే నటీనటులు అందరూ సినిమా కథ వింటారు. కానీ ఆ సినిమాను ఆడియన్స్ దగ్గరకు తీసుకు వెళ్లే డిస్ట్రిబ్యూటర్ లు మాత్రం సినిమాని చూడకుండా, కథ ఏంటో కూడా తెలుసుకోకుండా డబ్బులు పెట్టి కొంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కి సినిమా అమ్మడంతోనే సేఫ్ అయ్యిపోతాడు.
కానీ సినిమా ప్లాప్ అయ్యినప్పుడు మాత్రం ఆ నష్టం అంతా భరించాలసింది డిస్ట్రిబ్యూటర్ లు మాత్రమే. ఉదాహారానికి, విజయ్ దేవరకొండ – లైగర్, చిరంజీవి – ఆచార్య సినిమాలను అధిక రేట్లకు నిర్మాతలు అమ్మారు. కానీ వాటి రిజల్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ని బాగా నష్టపరిచింది. అందుకే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కనుమరుగైపోతుంది” అంటూ వ్యాఖ్యానించాడు.