Dil Raju Tells Interesting Story Behind Nithiin Dil Movie Title
Dil : నితిన్ రెండవ సినిమా దిల్ తోనే నిర్మాతగా మారారు రాజు. దిల్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో దిల్ రాజుగా మారి అగ్ర నిర్మాతగా అయ్యారు. దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ లో బ్రాండ్ గా మారింది. నితిన్ తమ్ముడు సినిమా జులై 4 రిలీజ్ కానుంది. ఈ సినిమాని దిల్ రాజే నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు, నితిన్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.
ఈ క్రమంలో నితిన్ మాట్లాడుతూ.. నేను దిల్ రాజు ని అంకుల్ అని పిలుస్తాను. నాకు 8వ తరగతి నుంచి తెలుసు. మా నాన్న, దిల్ రాజు అంకుల్ కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అని తెలిపాడు.
Also Read : Jagapathi Babu : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటున్న జగపతి బాబు.. యాంకర్ గా మారి కొత్త టీవీ షో.. ప్రోమో వైరల్..
దిల్ రాజు మాట్లాడుతూ.. ఆది సినిమా రిలీజ్ అయ్యాక నేను, వినాయక్ ఒక కార్ లో వెళ్తుంటే బేగంపేట దగ్గర జయం పోస్టర్ చూసాము. అప్పటికి జయం ఇంకా రిలీజ్ అవ్వలేదు. వినాయక్ ఈ హీరోతో సినిమా చేద్దాం అంటే నేను ఓకే చెప్పాను. అతను నాకు తెలుసు మన సుధాకర్ రెడ్డి కొడుకే అని చెప్పాను. అయితే దిల్ టైటిల్ మొదట మన దగ్గర లేదు. నువ్వు కూడా దిల్ టైటిల్ అడిగావు. నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ దగ్గర ఆ టైటిల్ ఉంది. ఆయన ఇవ్వబట్టే దిల్ టైటిల్ వచ్చి హిట్ అయింది. నేను దిల్ రాజు అయ్యా. దిల్ పెద్ద బ్రాండ్ అయింది అని తెలిపారు. దీంతో దిల్ సినిమా టైటిల్ వేరే నిర్మాత రిజిస్టర్ చేయించాడని, వీళ్ళు అడగడంతో ఇచ్చినట్టు తెలుస్తుంది.