Kaushal Manda : వామ్మో అప్పట్లోనే అంత సంపాదించాడా? పవన్, మహేష్, ఎన్టీఆర్.. అందరూ కౌశల్ దగ్గరికే.. ఆ సినిమా లైఫ్ చేంజ్..
ఓ కొత్త పని కనిపెట్టి టాలీవుడ్ లో ఎదిగానని చెప్పుకొచ్చాడు.

Do You Know Kaushal Manda Earns So Much from Modeling and Casting Director
Kaushal Manda : కౌశల్ చాలామందికి బిగ్ బాస్ నుంచి మాత్రమే తెలుసు. కానీ 1998 లోనే సినీ పరిశ్రమకు వచ్చాడు కౌశల్. మోడల్ గా చేస్తూ నటుడిగా సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం కూడా మోడలింగ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కౌశల్ మండా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా మోడలింగ్ ఏజెన్సీతో చాలా సంపాదించానని, మహేష్ సినిమాతో తన ఫేట్ మారిందని, ఓ కొత్త పని కనిపెట్టి టాలీవుడ్ లో ఎదిగానని చెప్పుకొచ్చాడు.
కౌశల్ మాట్లాడుతూ.. వైజాగ్ నుంచి హైదరాబాద్ కి మోడల్ గా వచ్చా. మోడలింగ్ చేస్తూనే నటుడిగా అవకాశాలు ట్రై చేసేవాడిని. రాజకుమారుడు సినిమా చేసేటప్పుడు కొంతమంది మోడల్స్ నా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి సెట్ కి వచ్చేవాళ్ళు. మహేష్ గారు అది చూసి ఒక సాంగ్ లో మోడల్స్ కావాలి మీ వాళ్ళు చేస్తారా అని అడిగితే 20 మంది అమ్మాయిలు, అబ్బాయిలు మోడల్స్ ని తీసుకొచ్చి అరేంజ్ చేశాను. వారం రోజులు షూట్ జరిగింది. సినిమా అంతా నాకు ఆర్టిస్ట్ గా 50 వేలు వస్తే, మోడల్స్ ని తెచ్చినందుకు 80 వేలు వచ్చాయి. దాంతో సినిమాల్లో మోడల్స్ కావాలని అర్థమైంది. దాంతో నేనే మోడలింగ్ ఏజెన్సీ పెట్టి క్యాస్టింగ్ డైరెక్టర్ గా మారాను.
Also Read : Akkineni Family : అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్..
మహేష్ బాబు నాకు ఇంకో రెండు సినిమాలు ఇప్పించాడు. అప్పుడు బద్రి, ఖుషి, తమ్ముడు, వంశీ.. చాలా పెద్ద సినిమాలకు మోడల్స్ కోసం నా దగ్గరకే వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో మాట్లాడి సినిమాల్లో క్యాస్టింగ్ చేసారు. దాంతో ప్రతి సినిమాకు లక్షల్లో అమౌంట్ వచ్చేది. రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరి జగన్నాధ్.. ఇలా సినీ పరిశ్రమలో స్టార్స్ అంతా నా దగ్గరికి వచ్చేవాళ్ళు మోడల్స్ కోసం. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు నేనే క్యాస్టింగ్ డైరెక్టర్. సోమాజిగూడలో మోడలింగ్ ఏజెన్సీ ఆఫీస్ పెట్టాను. హైదరాబాద్ లో ఫస్ట్ ఆఫీస్ నాదే. సినిమా వాళ్లంతా మోడల్స్ కోసం అక్కడికే వచ్చేవాళ్ళు.
మోడలింగ్ ఏజెన్సీ ద్వారా, క్యాస్టింగ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోయా ఒక మూడేళ్లు పీక్ స్టేజ్ చూసాను. దాంతో నేను ఫైనాన్షియల్ గా కూడా సెట్ అయ్యా. అందరికి ఛాన్సులు ఇప్పించా, నేను డబ్బు సంపాదించుకున్నా. 18 ఏళ్లకే సొంతిల్లు కొనుక్కున్నాను హైదరాబాద్ లో. కానీ క్యాస్టింగ్ డైరెక్టర్ గా అమ్మాయిలను పంపిస్తున్నాడు అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆ పని వదిలేసాను. కేవలం మోడలింగ్ మాత్రమే చేశాను తర్వాత అని తెలిపాడు.
Also Read : Kaushal Manda : 17 ఏళ్లకు హైదరాబాద్ కి.. అమ్మకు క్యాన్సర్.. డబ్బుల కోసం అలాంటి క్యారెక్టర్స్ చేశా..