Akkineni Family : అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్..
తాజాగా మరికొన్ని అఖిల్ పెళ్లి ఫోటోలు బయటకు రాగా ఓ ఫొటో స్పెషల్ గా మారింది.

Photo Credits : eshantrajuphotography Instagram
Akkineni Family : ఇటీవల జూన్ 6న అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లోనే జరిగింది. వీరి వివాహానికి అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అఖిల్ పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరికొన్ని అఖిల్ పెళ్లి ఫోటోలు బయటకు రాగా ఓ ఫొటో స్పెషల్ గా మారింది.
ఈ ఫొటోలో అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఉన్నారు. నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ – అఖిల్ భార్య జైనబ్ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ స్పెషల్ మూమెంట్ లో ఉన్నారు. ఇలా ఇద్దరు అక్కినేని కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో క్యూట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Kaushal Manda : 17 ఏళ్లకు హైదరాబాద్ కి.. అమ్మకు క్యాన్సర్.. డబ్బుల కోసం అలాంటి క్యారెక్టర్స్ చేశా..
గత సంవత్సరం డిసెంబర్ లో నాగచైతన్య – శోభిత ధూళిపాళ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోనే అక్కినేని ఫ్యామిలీకి రెండో కోడలు కూడా రావడంతో ఫ్యామిలీ కళకళలాడుతుందని అంటున్నారు.