Kaushal Manda : 17 ఏళ్లకు హైదరాబాద్ కి.. అమ్మకు క్యాన్సర్.. డబ్బుల కోసం అలాంటి క్యారెక్టర్స్ చేశా..
ఈ క్రమంలో కెరీర్ మొదట్లో డబ్బుల కోసమే ఏదో ఒక సినిమా చేసాను అని చెప్పుకొచ్చాడు.

Kaushal Manda Tells about his Career Beginning Struggles
Kaushal Manda : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న కౌశల్ మండా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మోడలింగ్, మోడలింగ్ ఏజెన్సీలు నడుపుతూ ఉన్నాడు. ఇటీవల కన్నప్ప సినిమాలో విష్ణు ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో కెరీర్ మొదట్లో డబ్బుల కోసమే ఏదో ఒక సినిమా చేసాను అని చెప్పుకొచ్చాడు.
Also Read : Bobby Deol : యానిమల్ రిలీజయ్యాక.. ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా..
కౌశల్ మాట్లాడుతూ.. నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చేసాను. అంతకు ముందే వైజాగ్ లోనే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టా. అప్పట్లో సిక్స్ ప్యాక్ ఉంది. అది చూపించాలి అని కొన్ని సినిమాలు చేశాను. ఆ సమయంలోనే హీరోగా రెండు సినిమాలు చేశాను. అప్పుడు మా అమ్మకు క్యాన్సర్, ఒక్కో ఇంజెక్షన్ కి 20 వేలు అయ్యేది. అందుకే డబ్బుల కోసమే ఆ సినిమాలు చేసాను. అవి ఆడలేదు. ఆ తర్వాత ఆర్టిస్టుగా ఒకే రకం పాత్రలు వచ్చేవి కానీ డబ్బుల కోసమే అలాంటి సినిమాలు, అలాంటి క్యారెక్టర్స్ చేశాను.
రాజకుమారుడు సినిమాతోనే నా ఫేట్ మారింది. మోడలింగ్ వాళ్ళని సినిమా వాళ్లకు ఆర్టిస్టులుగా సప్లై చేసే ఏజెన్సీ మొదలుపెట్టాక డబ్బులు బాగా సంపాదించా. దాంతో నటుడిగా ఆపేసాను. కొన్నాళ్ళకు మళ్ళీ వద్దామంటే సినిమాల్లో ఛాన్సులు రాలేదు. దాంతో సీరియల్స్ లోకి వెళ్ళాను. సూర్యవంశం సీరియల్ లో నా విలన్ రోల్ నచ్చి బిగ్ బాస్ కి అడిగారు అని తెలిపాడు.
Also Read : Kaushal Manda : అమ్మాయిలను పంపిస్తాడు అని నా గురించి బ్యాడ్ గా.. అందుకే అంత సంపాదన ఉన్నా వదిలేసా..