Bobby Deol : యానిమల్ రిలీజయ్యాక.. ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా..

తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ బాబీ డియోల్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

Bobby Deol : యానిమల్ రిలీజయ్యాక.. ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా..

After Animal Director Jyothi Krishna Changer Bobby Deol Characterization in Harihara Veeramallu

Updated On : June 30, 2025 / 12:57 PM IST

Bobby Deol : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎట్టకేలకు జులై 24 విడుదల కానుంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా ట్రైలర్ జూలై 3న విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు.

తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ బాబీ డియోల్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. హరి హర వీరమల్లు సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read : Thank You Dear : హెబ్బా పటేల్ ‘థాంక్యూ డియర్’ టీజర్ రిలీజ్..

జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ యానిమల్ సినిమాలో చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. ఆ పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన నటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ పాత్రను మళ్ళీ రాసుకున్నాము. మరింత శక్తివంతంగా ఆ పాత్రను మార్చాము. నేను ఆయన పాత్రకు తగ్గ స్క్రిప్ట్ ని మార్చి చెప్పినప్పుడు బాబీ డియోల్ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని తెలిపారు.

అయితే మూవీ యూనిట్ సమాచారం ప్రకారం జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతలు తీసుకున్న తర్వాత బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. మరింత బలంగా ఆ పాత్రను రాశారట. యానిమల్ తర్వాత బాబీ డియోల్ కి వచ్చిన స్టార్‌డమ్‌ కి ఈ పాత్ర న్యాయం చేసేలా ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తుంది.

Image

Also Read : Allari Naresh : అల్లరి నరేష్ 63.. టైటిల్ ఇదే.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌..