Allari Naresh : అల్లరి నరేష్ 63.. టైటిల్ ఇదే.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌..

అల్లరి నరేష్ కెరీర్‌లో 63వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న మూవీ టైటిల్ ఫిక్సైంది.

Allari Naresh : అల్లరి నరేష్ 63.. టైటిల్ ఇదే.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌..

Allari Naresh 63 Movie title is Alcohol

Updated On : June 30, 2025 / 10:55 AM IST

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. తాజాగా ఆయ‌న మెహర్ తేజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో 63వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. నేడు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రానికి ‘ఆల్కహాల్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. టైటిల్‌ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.

Kaushal Manda : అమ్మాయిలను పంపిస్తాడు అని నా గురించి బ్యాడ్ గా.. అందుకే అంత సంపాదన ఉన్నా వదిలేసా..

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మిస్తున్నారు. రుహాని శర్మ కథానాయిక. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.